Monday, December 23, 2024

పాండురంగ విఠలేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

మాక్లూర్ : మాక్లూర్ గ్రామంలో అయ్యప్ప సహిత ఆంజనేయ శివ పంచాయతన సహిత శ్రీరుక్మిణి పాండు రంగ విఠలేశ్వర స్వామి వారిని ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కవితకు ఆలయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా ఈ కార్యక్రమంలో పూజలో పాల్గొని అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయనతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.

బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బడుగు సత్యనారాయణ, ఎంపిపి మాస్త ప్రభాకర్, మండల కోఆప్షన్ మెంబర్ కో కైమాద్, స్థానిక సర్పంచ్ ఆశోక్ రావు, జీవన్ జిల్లా ప్రజా ప్రతినిధులు యువ నాయకుడు గోపు రంజిత్, వార్డ్ మెంబర్లు లక్ష్మీ నారాయణ, ఉప సర్పంచ్ అనిత, నగర మేయర్ నీతూ కిరణ్, కార్పొరేటర్ టిఆర్‌ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News