Thursday, January 23, 2025

ప్రైవేట్ కార్యక్రమానికి పోలీసుల గస్తీ…?

- Advertisement -
- Advertisement -
  • ప్రైవేట్ ఆసుపత్రి ప్రచారానికి ట్రాఫిక్ అంతరాయం
  • రోడ్డుపైన కార్యక్రమం రాకపోకలకు ఇబ్బందులు
  • తూతూ మంత్రంగా హెల్మెట్‌ల పంపిణీ

నారాయణఖేడ్ టౌన్: రహదారులపై ఇబ్బందులను తొలగించే పోలీసు అధికారులు రహదారిపై ఓ ప్రైవేట్ ఆసుపత్రి కార్యక్రమాన్ని ప్రచారంగా నిర్వహించారు. తూతూ మంత్రంగా హెల్మెట్‌లను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించడంతో హెల్మెట్ల కోసం వచ్చిన ద్విచక్ర వాహనదారులు అధిక సంఖ్యలో వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా ఖేడ్ పట్టణ కేంద్రంలో గల రాజీవ్‌చౌక్ ప్రాంతంలో ఖేడ్ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన కూడలి వద్ద అధిక సంఖ్యలో ప్రయాణికులు ప్రతినిత్యం రాకపోకలు ఇక్కడి నుంచి కొనసాగిస్తుంటారు. దీంతో అక్కడ సమావేశం ఏర్పాటు చేయడంతో బస్సులను అక్కడి దారిగుండా తీసుకెళ్లేందుకు అటు ఆర్టీసి సిబ్బంది , ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. దీంతో ప్రయాణికులు ఎక్కడ నిల్చొవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

కాగా నియోజకవర్గంలోని అన్ని మండలాల పోలీసు సిబ్బంది కొందరు, ఎస్‌ఐలు, సిఐలు, డిఎస్పితో సహ ఈ సమావేశంలో పాల్గొని హెల్మెట్‌లను పంపిణీ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రి నామకరణం పేరిట విస్త్రృత ప్రచారానికి సమావేశం ఏర్పాటు చేయడంతో ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని పలువురు వాపోయారు. కాగా ప్రైవేట్ ఆసుపత్రికి పోలీసుల గస్తీ ఏమిటని పలువురు ఆరోపించారు. కాగా వందలాది మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌లు అందుతాయని ఆ సమావేశం వద్ద ఎదురుచూపులు చేయగా కొందరికీ మాత్రమే హెల్మెట్‌లను అందజేసి సమావేశం మొక్కుబడిగా ముగించారని కొందరు ద్విచక్ర వాహనదారులు ఆరోపించారు. హెల్మెట్ల కోసం వచ్చిన పలువరికి అందకపోవడంతో వెనుదిరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News