Tuesday, December 24, 2024

14,361 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్
డిమాండ్ ఎంతున్న అంతరాయం లేకుండా చూస్తాం : ట్రాన్స్ కో జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు

మన తెలంగాణ / హైదరాబాద్ : శుక్రవారం ఉదయం 11 గంటల ఒక నిమిషానికి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన 12,251 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా అది నిన్నటి రోజున సెప్టెంబర్ 25న 14,361 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ఖరీఫ్‌లో ఇదే అత్యధిక విద్యుత్ వినియోగం కావడం గమనార్హం. వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, రాష్ట్రంలో భారీగా వరి పంట సాగు విస్తీర్ణం పెరగడంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినట్లు భావిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల నేపథ్యంలోనూ విద్యుత్ వినియోగం పెరిగిందని అంటున్నారు. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగానిదే 37 శాతం అని, దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్నారు. క్రితం సంవత్సరం నమోదు చేసుకున్న వినియోగం రికార్డులు బద్దలు కొడుతూ నిన్న ఈ 14,361 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగిందని చెబుతున్నారు.
డిమాండ్ ఎంతున్న అంతరాయం లేకుండా చూస్తాం .. ట్రాన్స్ కో జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు
గత సంవత్సరం కృష్ణా నది భారీ వర్షాలు,వరదలతో శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండడంతో పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి అయ్యేది కానీ ఈ సంవత్సరం నీటి లభ్యత లేకపోవడంతో జల విద్యుత్ ఉత్పత్తి కూడా లేకున్నా ఎక్కడ అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్ కో జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు తెలిపారు. డిమాండ్‌కు తగ్గట్లుగా ఎక్కడ కూడా అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో దాదాపు 30 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉండడం దాదాపు 37 నుండి 40 శాతం విద్యుత్ వినియోగం అవుతోందని, దేశంలోనే అత్యధికంగా వ్యవసాయ రంగం విద్యుత్ వాడుతున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఆయన సిఎండి ప్రభాకర రావు తెలిపారు. ఈ క్రమంలోనే ఎంత డిమాండ్ వచ్చినా వ్యవసాయ రంగం సహా ఇతర అన్ని రకాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సిఎండి ప్రభాకర్ రావు భరోసా నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News