Sunday, December 22, 2024

ఆటోని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అన్నమయ్య జిల్లా కలకడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి గుట్టపల్లి వద్ద కడప-చిత్తూరు హైవేపై వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుప్పుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టో మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.కాగా, సీఎంఆర్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News