Sunday, December 22, 2024

రామసముద్రంలో కొండచిలువ కలకలం

- Advertisement -
- Advertisement -

మక్తల్ ః మండలంలోని రామసముద్రంలో మంగళవారం భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన కుమ్మరి బస్వరాజ్ ఇంటి వద్ద కొండచిలువ ప్రత్యక్షం కావడంతో పిల్లలతో పాటు పెద్దలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సహకారంతో కొండచిలువను హతమార్చినట్లు బస్వరాజ్ తెలిపారు. గ్రామంలోని ఇండ్ల మధ్య చెట్ల పొదలు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో తరచూ పాములు, విషసర్పాలు వస్తున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News