Monday, December 23, 2024

అమిత్ షా హిందీ దురభిమానానికి ఏఆర్ రహ్మాన్ ధీటైన పోస్ట్!

- Advertisement -
- Advertisement -

 

AR Rehman
చెన్నై: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇంగ్లీషులో కాకుండా హిందీలోనే మాట్లాడుకోవాలని అన్నారు. దానికి ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీతకారుడు ఏఆర్ రహ్మాన్ శుక్రవారం సోషల్ మీడియాలో ధీటైన జవాబిస్తూ ‘బిలవ్డ్ తమిళ్’ (ప్రియమైన తమిళమా) అంటూ పోస్ట్ పెట్టారు. అంతేకాక ఆయన ‘తమిళ దేవత’ చిత్రాన్ని కూడా షేర్ చేశారు. మనోన్‌మణియం సుందరం పిళ్ళై రాసిన, ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచిన తమిళ జాతీయ గీతంను కూడా ప్రస్తావించారు. 20వ శతాబ్దపు ఆధునిక తమిళ కవి భారతీదాసన్ తమిళ గేయాల ‘తమిళియ్యకమ్’ పుస్తకపు పంక్తిని కూడా ఆయన షేర్ చేశారు. ‘మా ఉనికికి ప్రియమైన తమిళ్ మూలం’ అన్నది ఆ పంక్తి. రహ్మాన్ తన పోస్ట్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇదిలావుండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ‘బిజెపి ప్రభుత్వం దేశంలోని బహుళత్వ ఉనికిని దెబ్బతీస్తోంది,పైగా అమిత్ షా ప్రకటన దేశపు ఐక్యతను దెబ్బతీసేదిగా ఉంది, షా తరచూ అదే తప్పు చేస్తున్నారు. అయినా ఆయన ఈ విషయంలో విజయం సాధించలేరని గుర్తుచేస్తున్నాను’ అన్నారు. కాగా రహ్మాన్ ఇదివరలో..2019 జూన్‌లో కూడా తమిళ భాషకు మద్దతు ఇస్తూ ప్రకటన చేశారు. అప్పట్లో ఆయన హ్యాష్‌ట్యాగ్ అటానమస్ తమిళనాడు కింద ట్వీట్ చేశారు. అది ప్రపంచవ్యాప్తంగా తమిళ అభిమానులను ఉత్సాహపరిచింది. తమిళనాడులో దాదాపు అన్ని పార్టీలు జాతీయ భాషను తమపై రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడులో తమిళం, ఇంగ్లీష్ ప్రాథమిక భాషలు. హిందీ బోధన తప్పనిసరి కాదక్కడ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News