Wednesday, January 22, 2025

కంగేర్ వ్యాలీ నేషనల్ పార్కులో అరుదైన నారింజ రంగు గబ్బిలం

- Advertisement -
- Advertisement -

జగదల్‌పూర్ ( చత్తీస్‌గఢ్ ) : అంతరించిపోతున్న క్షీరద తెగల్లో అపురూపమైన గబ్బిలం కంగేర్ వ్యాలీ జాతీయ పార్కులో బుధవారం కనిపించింది. శరీర మంతా ముదురు నారింజ రంగుతోను, నల్లని రెక్కల తోను ఆకర్షణీయంగా కనిపించే ఈ గబ్బిలం “పెయింటెడ్ బ్యాట్ ”గా ప్రసిద్ధి చెందింది. పార్కు ప్రాంతంలో ఉండే పరలి బోదల్ గ్రామంలో అరటి తోటలో దీన్ని మొదట సోమవారం కనుగొన్నారని నేషనల్ పార్కు డైరెక్టర్ ధర్మశీల్ గన్వీర్ చెప్పారు.

ఈ పార్కులో గత కొన్ని సంవత్సరాలుగా ఈ గబ్బిలం కనిపించడం ఇది మూడోసారి. ఇంతకు ముందు 2020,2022 లో ఈ పార్కులో ఇది కనిపించింది. సున్నం రాయి గుహలకు ఈ పార్కు ప్రసిద్ధి అని, గబ్బిలాల నివాసానికి ఇవి అనుకూలంగా ఉంటాయని నిపుణులు చెప్పారు. బంగ్లాదేశ్, మయన్మార్, కాంబోడియా, చైనా, భారత్, ఇండోనేసియా, మలేసియా, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాంలలో సాధారణంగా ఈ గబ్బిలాలు సంచరిస్తుంటాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News