Monday, December 23, 2024

తిరిగి తెరుచుకున్న జోజిలా మంచు కనుమదారి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతాలు అయిన జమ్మూ కశ్మీర్ , లద్ధాఖ్‌లకు ముఖద్వారంగా ఉండే అత్యంత కీలకమైన జోజిలా కనుమ రాదారి తిరిగి తెర్చుకుంది. సరిహద్దులలోని రహదారుల బాధ్యతలో ఉన్న బిఆర్‌ఒ గురువారం ఈ జోజిల్లా రాదారిని తిరిగి రాకపోకలకు ఆరంభించింది. హిమాలయాల్లో 11,650 అడుగుల ఎత్తున ఉండే ఈ దారిని జనవరి 7వ తేదీన భారీ హిమపాతంతో మూసివేశారు. సాధారణంగా మంచుకురిసే దశల్లో ఎతైన ప్రాంతాలలోని కనుమల దారులలో రాకపోకలు నిలిపివేస్తూ ఉంటారు. డ్రాస్ సెక్టార్‌లో ఉండే ఈ కనుమల దారి ఈసారి 68 రోజుల పాటు మూసివేయాల్సి వచ్చింది.

గత ఏడాది దీనిని 73 రోజులు రాకపోకలకు నిలిపివేశారు. ఈ నెల 11 నుంచి క్రమేపీ ఇక్కడ రాకపోకలు పునరుద్ధరణ జరుగుతూ వచ్చిందని , రెండువైపుల నుంచి వాహనాలు వస్తూ పొయ్యేందుకు అనువైన పరిస్థితి ఏర్పడిందని రక్షణ మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాంతంలో పేరుకుపోయిన మంచును తొలిగించి దుర్లభ పనిని రికార్డు స్థాయిలో వేగవంతంగా ముగించినందుకు సంబంధిత సిబ్బందిని అభినందిస్తున్నట్లు బిఆర్‌ఒ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి అభినందనలు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News