Monday, December 23, 2024

వృక్షాల సంరక్షణకు రియల్-టైం ప్రొటెక్షన్ చిప్

- Advertisement -
- Advertisement -

ప్రయోగాత్మకంగా బోటానికల్ గార్డెన్‌లో ఏర్పాటు

హైదరాబాద్ : నగరంలో ఎన్నో విలువైన వృక్షాలను రాత్రికి రాత్రి కొట్టేయడం జరుగుతుందని, దానిని నివారించేందుకు ప్రయోగాత్మక చర్యలు చేపట్టామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండి డాక్టర్ జి. చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బోటానికల్ గార్డెన్‌లో 50 విలువైన వృక్షాలకు రియల్ టైం చిప్ సెన్సర్‌ని ఏర్పాటు చేశారు. సిబిఐఓటి. టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రొటెక్షన్ సిస్టం అనే సెన్సర్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరికరంతో చందనం, ఎర్రచందనం వంటి విలువైన వృక్షాలను దొంగతనం, కొట్టేయడం, తరలించడం జరగకుండా ఈ పరికరం నిరోధిస్తుంది. 3.6 వాలట్స్ లైథియం ఇయన్ బ్యాటరీస్ తో పని చేస్తుంది. ఈ పరికరం చెట్లను ఎవరైనా కోటేస్తున్నా.. తొలగించినా క్షణంలో అల్టర్స్‌ని మొబైల్ అప్లికేషన్‌కు, వాట్సాప్ కి పంపిస్తుంది. అదే విధంగా- ఎలక్ట్రానిక్ అలారంను మోగిస్తుంది. దీనితో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై చెట్లను రక్షించుకోగలుగుతారు. టెక్నాలజీ సిఈఓ సత్యనారాయణ చొప్పదండి మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రయోగత్మకంగా బోటనికల్ గార్డెన్‌లోని 50 చెట్లకు అమర్చడం జరిగిందన్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఎండి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో విలువైన వృక్షాలు అంతరించిపోతున్నాయని, వాటిని రక్షించేందుకు రియల్ టైం చీప్ సెన్సర్‌ని వినియోగించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఈడి రంజిత్ నాయక్, డైరెక్టర్ అక్బర్, జిఎం రవీందర్ రెడ్డి, సుమన్, రాజశేఖర్ పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News