Sunday, December 22, 2024

మెట్రో రికార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు రికార్డు క్రియేట్ చేసింది. జూలై 3వ తేదీ (సోమవారం రోజున) మెట్రో రైలులో 5 లక్షల 10 వేల మంది ప్రయాణి కులను మెట్రో వారి వారి గమ్యస్థానాలకు చేర్చి రికార్డు సృష్టించింది. ఒక్క రోజే ఇంత భారీ స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించడం కొత్త రికార్డు అని మెట్రో అధికారులు తెలిపారు. నాగోల్ నుంచి హైటెక్ సిటీ, ఎల్బీనగర్ నుంచి కూకట్‌పల్లి మార్గంలో భారీ సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించారని మెట్రో అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటివరకు 40 కోట్ల మంది ప్రయాణికుల చేరవేత
మియాపూర్ టు ఎల్బీనగర్ మార్గంలో 2.60 లక్షల మంది, జేబిఎస్, ఎంజిబిఎస్ స్టేషన్ నుంచి 25 వేల మంది, రాయదుర్గ్ స్టేషన్ నుంచి 32 వేల మంది, ఎల్‌బి నగర్ స్టేషన్ నుంచి 30 వేల మంది, అమీర్‌పేట్ స్టేషన్ నుంచి 29 వేల మంది మెట్రోలో ప్రయాణించారు. ఇప్పటివరకు హైదరాబాద్ మైట్రోరైలు 40 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రోలో ఇటీవల ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఆఫీసు వేళల్లో మెట్రోలో జనం రద్దీగా ఉంటుండగా అమీర్‌పేట్ జంక్షన్ ఉదయం, సాయంత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. సోమవారం రోజున ఉప్పల్, ఎల్బీనగర్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో నిండిపోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News