Sunday, January 19, 2025

మా పాలనకు రెఫరెండం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత దగ్గరయ్యామని, అందుచేతనే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని, కనీసం 14 పార్లమెంట్ సీట్లను గెలవబోతున్నామని, ఇందులో ఎలాంటి సందేహాలకు తా వులేదని, తమ పరిపాలనకు రానున్న ఫ లితాలు రిఫరెండమేనని సిఎం రేవంత్‌రెడ్డి సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చె ప్పారు. గత పాలకులు వందేళ్ళకు సరిపడా విధ్వంసం చే శారని, కానీ వంద రోజుల వ్యవధిలోనే పా లనను పట్టాలెక్కించే ప్రయ త్నం చేస్తున్నామన్నారు. మంగళవారం సాయంత్రం డా క్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మీడియా ప్రతినిధులతో  జరిగిన ఇష్టాగోష్టిలో పలు ఆసక్తికర అంశాలను వివరించారు. ప్రభుత్వ పాలనలోనే కాకుండా రాజకీయంగా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి ఓపికగా గంటన్నరసేపు జవాబులు ఇచ్చారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టంకడతారని గట్టి నమ్మకం, విశ్వాసం తనకుందని, ప్రజలు బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలను నమ్మే పరిస్థితుల్లో లేరని కరాఖండిగా చెప్పారు. అంతేగాక కారు పార్టీ, కమలం పార్టీల నేతలు కూడబలుక్కునే లోక్‌సభ స్థానాలకు వ్యూహాత్మకంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించాయని అన్నారు. తన కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయరని, ఎవరి వ్యాపకాల్లో వారు బిజీగా ఉన్నారని, మొదట్నుంచి కూడా తన కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అధినేతగా రాహుల్‌గాంధీని మన రాష్ట్రంలో పోటీ చేయాలని కోరుతూ తీర్మానం చేశామని, తుది నిర్ణయం తీసుకునే అధికారం కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సంస్థ అయిన సిడబ్లుసి ఉందని, అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపైనే రాహుల్‌గాంధీ తెలంగాణలో పోటీ చేసే అంశం ఆధారపడి ఉంటుందని సిఎం రేవంత్ చెప్పారు. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే కాదు ఏ ఇతర పార్టీల ఎంఎల్‌ఎలు వచ్చిన తనను కలవడంలో ఎలాంటి తప్పులేదని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, వారివారి నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చి వినతి పత్రాలు ఇస్తుంటారని, ఇందులో ఎలాంటి నేరం-ఘోరం ఏమీలేదని తనదైన శైలిలో సిఎం వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిని ప్రత్యర్ధి రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు కలిస్తే అదేదో రాజకీయ స్వలాభం కోసమేనన్నట్లుగా, అదొక పెద్ద నేరమన్నట్లుగా మాజీ సిఎం కెసిఆర్ ఒక అపవాదును సృష్టించారని, అలాంటి ఆలోచనా ధోరణుల నుంచి మీరు (విలేకరులు) కూడా బయటపడాలని సిఎం వ్యాఖ్యానించారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ఘటనపైనగానీ, గత పాలకులకు స్కాంలలో సహకరిస్తూ వచ్చిన ఇంజనీరింగ్ అధికారులపై తగిన చర్యలు తీసుకొని ఇంటికి పంపించామని, వేటు వేసిన అధికారుల వివరాలను స్థానిక బిజెపి నేతలు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడంతో విఫలమయ్యారని, రాష్ట్ర కమలం పార్టీ నేతలు ప్రధానిని తప్పుదారి పట్టించారని, అందుకే పిఎం అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని సిఎం రేవంత్ అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత పాలకులు దోచుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అవినీతికి పాల్పడుతోందని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందిస్తూ రాష్ట్ర బిజెపి నేతలపై మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిన ఘటనపై ఎన్‌డిఎస్‌ఎ సిఫారసులనే అమలు చేస్తామని, ఈ ప్రాజెక్టుపై నాలుగు వారాల్లోగా నివేదిక ఇస్తే దోషులపై ఎన్నికల్లోపే తగిన చర్యలు తీసుకొంటామని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో దోషులను శిక్షించాలన్నా… తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించాలన్నా… తప్పకుండా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఇంజనీరింగ్ నిపుణులు ఇచ్చే నివేదికల ఆధారంగా తగిన చర్యలుంటాయని చెప్పిన సిఎం రేవంత్ తాను ఇంజనీరింగ్ నిపుణుడిని కాదని, తానేమీ 80 వేల పుస్తకాలు (కెసిఆర్‌ను ఉద్దేశించి) చదవలేదని, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్‌రావుల చెప్పే సలహాలు, సూచనలు విని తాము కూడా అలాంటి తప్పుడు నిర్ణయాలే తీసుకుంటే మేడిగడ్డ (మేడిపండు) మాదిరిగానే మళ్ళీ కుంగిపోతాయని, అప్పుడు ఇదే ప్రజలు తమను నిందించరా…? అని సిఎం రేవంత్ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావులు ఆర్నమెంటల్ ఆర్గుమెంట్లు చేస్తున్నారని, వారు చెప్పినట్లుగా వింటే మేడిగడ్డకు పట్టిన గతే పడుతుందని అన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతామని, ఆ ప్రాజెక్టుతో ఆదిలాబాద్ జిల్లా ఒక లక్షా 60 వేల ఎకరాలకు సాగునీరందించడానికి వీలుందని, ఈ విషయాన్ని ప్రధానికి కూడా వివరించి సహాయం చేయమని కోరామని సిఎం రేవంత్ చెప్పారు.

దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా దేశానికి ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి పెద్దన్నే అవుతాడని, ఇప్పుడు ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడిని పెద్దన్నగా ప్రపంచ దేశాలు వ్యవహరిస్తుంటాయని, అదే తరహాలో మన దేశ ప్రధాని కూడా పెద్దన్నగా సంభోదించానని, అందులో ఎలాంటి తప్పులేదని సిఎం అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలపై వరుసగా దర్యాప్తులు జరుగుతున్నాయని, విజిలెన్స్ విభాగం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపైన దర్యాప్తు చేస్తోందని, అదే విధంగా అవినీతి నిరోధక శాఖ గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించేందుకు వీలుగా హైకోర్టును ఒక జడ్జిని కేటాయించాలని కోరామని, కానీ అది సాధ్యంకాదని చీఫ్ జస్టీస్ తిరుగు సమాధానం ఇచ్చారన్నారు. అవినీతి అధికారుల భరతం పడతామని గట్టి వార్నింగ్ ఇచ్చిన సిఎం రేవంత్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో చాలా పెద్దపెద్ద దొంగలున్నారని, వారి దోపిడికి అడ్డుకట్ట వేయడంతోనే నెలకు సగటున 500 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని, అదే విధంగా మైనింగ్ శాఖలోని ఇసుకపై గతంలో రోజుకు ఒక్క కోటి రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చేదని, ఇప్పుడు రోజుకు మూడున్నర కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని, అంటే రోజుకు రెండున్నర కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తోందన్నారు. ఇలా అవినీతికి అడ్డుకట్టవేస్తేనే ఖజానాకు రావాల్సిన ఆదాయం పెరుగుతోందని, అందుకే ప్రజలపై ఎలాంటి అదనపు పన్నుల భారాన్ని మోపకుండానే విజయవంతంగా ముందుకు సాగుతున్నామన్నారు. అంతేగాక సిఎంఆర్‌ఎఫ్‌పైన అంతర్గతంగా ఆడిట్ జరుగుతోందని, ఆడిట్ నివేదికలు వచ్చిన తర్వాత దోషులను కఠినంగా శిక్షిస్తామని సిఎం చెప్పారు. అంతేగాక ముంబాయి నగరంలో పట్టపగలే నరమేధం సృష్టించిన కసబ్ లాంటి టెర్రరిస్టును శిక్షించడానికి అనేక దర్యాప్తులు, విచారణలు జరిగాయని, అలాంటిది గత పాలకుల కుంభకోణాలపైన కూడా దర్యాప్తు జరిపించిన తర్వాతనే తగిన చర్యలు తీసుకొంటామని, లేకుంటే మీరే (విలేకరులు) మళ్ళీ అడ్డంగా వార్తలు రాస్తారు..? అని సిఎం వ్యాఖ్యానించారు.

రైతుబంధు (రైతు భరోసా) పథకాన్ని తప్పకుండా అమలు చేస్తామని, రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పేదలు, నిరుపేదలు, నిజంగా పెట్టుబడి సాయం అవసరమున్న రైతన్నలకు ఆర్ధిక సహాయం చేస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ముఖ్యమంత్రి రేవంత్ భరోసాగా చెప్పారు. అయితే ఫామ్ హౌస్‌లు, లే ఔట్‌లు, రోడ్లు, రాళ్ళు, రప్పలున్న భూములకు కూడా రైతుబంధు నిధులు ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది, నిజమైన రైతులు పంట పొలాల్లో సాగుచేస్తున్న చిన్న, సన్నకారు రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, అవసరమైతే రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులతోనూ అఖిల పక్ష సమావేశాలు నిర్వహించి, అసెంబ్లీలో చర్చలు జరిపి అత్యంత పగడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేస్తామని సిఎం రేవంత్ వివరించారు. జీవో 3పై కోర్టు అదేశాలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు జరుపతలపెట్టిన ఆందోళనలపై స్పందించిన సిఎం “సిరిసిల్లలో ప్రధాన సెంటర్‌లో కెటిఆర్ రోజంతా ధర్నా చేయాలని” తాను డిమాండ్ చేస్తున్నానని అన్నారు.

ఇలా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ధర్నాలు, ఉద్యమాలు, ఆందోళనలు చేస్తేనైనా ఆరోగ్యం బాగుంటుందని చమత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు చెల్లించాల్సిన బిల్లులు సుమారు 40 వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలున్నాయని, వాటిని చెల్లించడానికి ఏమైన ప్రయత్నాలు చేస్తున్నారా..? అని ప్రశ్నించగా “ఖజానాలోని ఆర్ధిక పరిస్థితులను చక్కదిద్దుకొని అన్ని బిల్లులను తప్పకుండా చెల్లిస్తామని సిఎం చెప్పారు. అంతేగాక తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే సర్పంచ్‌లకు కోటిన్నర రూపాయల వరకూ పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లించామని, ఇంకనూ చెల్లించాల్సిన బిల్లులున్నాయని, గత పాలకులు సర్పంచ్‌లకు ఇస్తామన్న నిధులు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి గ్రామాలను బాగుచేసుకొని చేసిన అప్పులు తీర్చలేక, గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో కొందరు సర్పంచ్‌లు ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారని, ఆ సమస్యను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నామని సిఎం రేవంత్ సగర్వంగా వివరించారు. 1998 డిఎస్‌సి, 2008డిఎస్‌సి అభ్యర్ధుల సమస్యలు తనకు తెలుసునని, వారి సమస్యలు పరిష్కరించడానికి తాను ఉన్నత స్థాయిలో సీనియర్ అధికారులతో సమీక్షించుకొని తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆరోగ్య శ్రీ నిధులను 60 రోజుల్లో విడుదల చేసే విధంగా ఒక ప్రణాళికను రూపొందిస్తామని సిఎం హామీ ఇచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News