Tuesday, January 21, 2025

గోల్కొండ కవుల సంచికతో విమర్శకులకు సమాధానం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : తెలంగాణలో కవులే లేరన్న విమర్శలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న సురవరం ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి అన్నారు. సామాజిక మార్పు కోసం నిరంతరం తపించిన మహనీయుడు సురవరం అని అన్నారు. స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్షమని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయమన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు బాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారని తెలిపారు.

ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేయాలని, ప్రతి ఒక్కరు ఆయనకు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ కె. నర్సింహ, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు కట్టా రవికిషన్‌రెడ్డి, అనంతరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, డిఎస్పీ మహేష్ , డిపిఆర్వో వెంకటేశ్వర్లు, రెడ్డి సేవా సంఘం నాయకులు ఇంద్రసేనారెడ్డి, ధనుంజయరెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News