Thursday, January 23, 2025

నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు వినతి

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజురు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్‌ను కలెక్టరెట్‌లో కలిసి వినతి ప త్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి ఎస్‌డిఎఫ్ నిధులు మంజూరు చేయాలని అలాగే డిగ్రీ కా లేజ్ ఏర్పాటు కోసం స్థలం మంజూరు చేయాలని కోరారు. కాప్రా, చర్లపల్లి రామంతపూర్ చెరువుల వద్ద ఉత్తరభారతీయు లు చత్ పూ జలు చేసుకునేందుకు అలాగే సూర్య భాగవాన్ ఆలయం నిర్మాణం కోసం స్ధలం మం జూరు చేయాలని కోరారు.

నియోజకవర్గ పరిధిలో దరఖాస్తు చేసుకున్న 58, 59 జివొ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. సానుకులంగా స్పందించిన కలెక్టర్ తగిన చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తె లిపారు. ఈకార్యక్రమంలో నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, లేతాకుల రఘుపతిరెడ్డి, కటెపల్లి జనార్ధన్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News