కేపీహెచ్‌బి: కూకట్‌పల్లిలో అధునాత వ్యవసాయ మా ర్కెట్ కోసం ఖైత్లాపూర్‌లో హౌసింగ్‌బోర్డుకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ కూకట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కుతాడిరాములు, డైరెక్టర్లతో కలిసి సోమవారం వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి వినతిపత్రం అంజదేశారు. భరత్‌నగర్ ఫ్లై ఒవర్ బ్రిడ్జి కింద తాత్కాలిక షెడ్లతో 1983నుంచి శంకర్‌పల్లి, చేవెళ్ళ, తాండురు తదితర ప్రాంతాలకు చెందిన రైతులు నేరుగా పంట ఉ త్పత్తులను తీసుకువచ్చి అమ్ముకుంటున్నారని, దీంతో అప్పట్లో ఏ 1 కమిషన్ ఎజెంట్లకు లైసెన్స్‌లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం 18మంది కమీషన్ ఏజెంట్లు , 30 మంది ట్రేడింగ్ లైసెన్స్ కలవారు, వందలాది మంది చిరు వ్యాపారులతోపాటు ఎంతో హమాలీ కార్మికులు ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు.
కొత్తగా కూకట్‌పల్లి వ్య వసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసినందున ఖైత్లాపూర్ సమీపంలోని హౌ సింగ్‌బోర్డు చెందిన స్థలం ఉందని, అందులో 5 ఎకరాల భూమి కేటాయిస్తే ఇక్కడ అధునాతమైన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేసుకోవచ్చని, దీని వల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రికి వివరించారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకంటామని హామీ ఇచ్చానట్లు మా ర్కెట్ కమిటీ తెలిపింది. మంత్రిని కలిసిన వారిలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షు లు మందాడి సుధాకర్‌రెడ్డి, డైరెక్టర్లు బొట్టువిష్ణు, సావిత్రి, భవాని, భా రతి, జిల్లాగోపాల్,బాబా, వేణుగోపాల్‌రెడ్డి, షరీఫ్, నర్సింగరావు, బంగారి శ్రీనివాస్‌రావు, ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.