Thursday, January 23, 2025

ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణపై సమీక్ష

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: చిన్నారులతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరు పాటుపడాలని డీసీపీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. బుధవారం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాట్ స్పాట్స్‌పై నిఘా ఉంచాలని, గతంలో రిస్కూ చేసిన పిల్లల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలను బాలకార్మికులుగా గుర్తించాలని, గొర్రెలు, మేకల కాపరులుగా, కిరాణం షాప్‌లు, మెకానిక్ షాపులు, హోటళ్లలో పని చేస్తున్న వారిని, బిక్షాటన చేస్తున్న, ఇటుక బట్టీలు, పౌల్ట్రీఫామ్‌లలో పని చేసిన, ఇతర ఏ ప్రాంతాల్లోనైనా పని చేస్తున్న వారిని గుర్తించి వారి తల్లితండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించాలని, లేదా స్టేట్ హోమ్‌కు పంపించాలన్నారు.

ప్రతి డివిజన్ పరిధిలో ఒక ఎస్‌ఐ, నలుగురు పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. వీరితోపాటు వివిధ డిపార్ట్‌మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు. బాలకార్మికులు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎవరైనా వీది బాలలను చూసినప్పుడు 1098 లేదా 100, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని డీసీపీ కోరారు. ఈ సమావేశంలో ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News