Monday, December 23, 2024

తెలుగు ఉభయ రాష్ట్రాల సంగీత విద్యాంసుల స్వరంపై రౌండ్ టేబుల్ సమావేశం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో: ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా అలయన్స్ ఫ్రాంకైస్ ఆఫ్ హైదరాబాద్, లమకాన్ ఆధ్వర్యంలో తెలుగు ఉభయ రా్రష్ట్రాల్లో సంగీత విద్యాంసుల స్వరం, సంగీత పోకడలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టౌబుల్ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పట్టణ, గ్రామీణ ప్రాంతాలోని జానపద, శాస్త్రీయ, రాప్, టాలీవుడ్, గజల్ , సంగీత విద్వాంసులు. సంగీత కళాకారుల జీవనోపాధి, సమకాలీన పోకడలను చర్చిస్తారు. సమావేశం అనంతరం పలువురు నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో ప్రేక్షకులు ఒకే వేదికపై విభిన్న సంగీత శైలుల సంగీతాన్ని ఆస్వాధించారు.

ఈ రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో సంగీత విద్వాంసులు టికె సోదరీమణులు, కర్ణాటక శాస్త్రీయ గాయకులు ,ఐఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ హరిణి రావు, హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు; పూర్వ గురు, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ గజల్ కళాకారుడు ఐషాన్ వాలి, ఫ్రీస్టైల్ రాపర్ సైకత్, పాటల రచయిత, బాస్ గిటారిస్ట్ , హైదరాబాద్ ఆధారిత గాయకులు మర్సుకోల కళావతి, జానపద గాయని చరిత్ర, సాహిత్యం కళల రంగాలలో పనిచేస్తున్న రచయిత, పరిశోధకుడు, చలనచిత్ర నిర్మాత గౌతమ్ పెమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News