Monday, December 23, 2024

పాఠశాల భవనం.. పశువుల కొట్టంగా మారిన వైనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నాంపల్లి : మండలంలోని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయితిలో ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారి ప్రక్కన ఆదే గ్రామానికి చెందిన దాత పాఠశాల భవన నిర్మాణం కోసం 20 గుంటల భూమి అందజేశారు. 1999లో ఉమ్మడి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నుండి డిపెప్ నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించి శిలాఫలకం వేశారు. ప్రభుత్వ నిధులతో పాఠశాల భవనం పూర్తి అయినా విద్యాశాఖ అధికారుల పాఠశాలవైపు కన్నెత్తి చూడలేదు. దీంతో భవనం నిర్వీర్యంగా మారింది. ఇదే అదనుగా భావించి కొంతమంది పలుకుబడి ఉన్న నాయకులు పాఠశాల భవనాన్ని పశువుల కొట్టంగా మార్చి అక్కడే పెంటకుప్పలు పోస్తూ ,పశువులను కట్టేస్తూ ,పశుగ్రాస నిల్వ చేస్తూ భవన ప్రాంతాన్ని మొత్తం కైవసం చేసుకున్నారు. ఇదే పరిస్థితి కొన్నాళ్లు సాగితే భవనాన్ని కూల్చి వేసి కబ్జా చేసే పనిలో ఉన్నట్లు గ్రామస్తులు మన తెలంగాణ దృష్టికి తీసుకువచ్చారు.

Also Read: పగలు ధవళ వర్ణం! రాత్రిళ్లు సప్త వర్ణం!

అదే పాఠశాల ఆవరణలో ముందుభాగంలో ఎస్సీ కార్పోరేషన్ నిధులతో కమ్యూనిటి హాల్ పేరుతో నిర్మించిన భవనం సైతం వినియోగించడంలో అటు అధికారలు ,ప్రజా ప్రతినిధులు విఫలం అయినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెండు భవనాల మద్య నిధులు ఖర్చుచేసి వంట శాల నిర్మించి అదీ పక్కకు పడేశారు . పాఠశాలభవనం, కమ్యూనిటీ హాల్, వంటశాల నిరుపయోగంగా మారి ప్రాంభోత్సవాలకుముందే శిధిలావస్థకు చేరడంతో వాటిని కబ్జాచేయాలని పశువులకొట్టం వేసినవారు యత్నం చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. కనైనా సంబందిత అధికారులు స్పందించి పాఠశాల భవనాన్ని కాపాడుకోవడంతో పాటు తగిన మరమ్మత్తులు చేయించి విద్యార్థులకు, కమ్యూనిటివారికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News