Sunday, December 22, 2024

గుంతలో దిగబడిన స్కూల్ బస్సు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామంలో మిషన్ భగీరథ పైపు పగిలి నెల రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించు కొకపోవడంతో రోజు నీరు వృథాగా పోతున్నాయి. ఆ నీటిలో ఎటూ వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో అక్కడే ఉన్న పైపునకు పెద్ద గుంత ఏర్పడి అది కాస్తా పెద్ద మడుగులా మారింది. నిత్యం నీళ్ళు నిలబడిన ఆ మడుగులో నుంచే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.

ఇదిలా ఉండగా గురువారం ఓ ప్రైవేటు పాఠశాల చెందిన బస్సు సుమారు 25 మంది పిల్లతో తాళ్ళంపాడు మీదుగా మునిగేపల్లి ఆ నీటి మడుగులో నుంచి వెళుతుండగా బస్సు గుంతలో దిగ బడింది. వెంటనే స్థానికులు బస్సులో ఉన్న పిల్లలను కిందకు దింపడంతో ప్రమాదం తప్పింది. బస్సు పల్టీ కొట్టినట్లు అయితే పెను ప్రమాదం చోటు చేసుకునేదని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సహాయంతో బస్సును బయటకు తీశారు. ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు పైపు లైన్ క్లియర్ చేసి గుంతను పూడ్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News