Monday, January 20, 2025

అరె కటికలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : ఆర్ కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అరె కటిక జనాభా పది లక్షలపై ఉన్నట్లు అరె కటిక అభివృద్ది సంఘం పేర్కొంది. శుక్రవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు అవుతుందని ఎకరం భూమి ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం కోటి రూపాయలు ప్రభుత్వం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బిసి బందు పథకంలో మనందరితో ఆరె కటిక అభివృద్ధి సంఘం కృషితో లక్ష రూపాయల స్కీంలో మన కులాన్ని 13వ సంఖ్యగా ప్రభుత్వం గుర్తించినందుకు హర్షం వ్యక్తం చేశారు. 2020 నుండి 2023 ఈ మూడు సం.రాలలో మన ఆరె కటికల మటన్ వృత్తిని సాగించలేక 9 మంది ఉరివేసుకొని ఆత్మహత్యల పాలయ్యారని ప్రత్యేక కార్పోరేషన్ ఉంటే ప్రత్యేక నిధులు ఉండి ఉంటే ఈ దారుణ పరిస్థితి జరిగేదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలుగా ఉన్న కులాలకు ప్రత్యేక నిధులు, రాయితీలు, నియామకాలు ప్రభుత్వం కల్పిస్తున్నది ఇది అన్యాయం మా కులాలన్ని ప్రభుత్వం గుర్తించాలని ఆసంఘం నాయకులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News