Thursday, November 14, 2024

మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : రాష్ట్ర జనాభాలో 23 శాతం కలిగిన మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మున్నూరుకాపు ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఉగ్గె శ్రీనివాస్ పటేల్ డిమాండ్ చే శారు. ప్రభుత్వంలో మున్నూరు కాపుకు చెందిన 9 మంది ప్రజాప్రతినిధు లు ఉన్నప్పటికీ, వారి వారి స్వార్థ ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారు కానీ విమర్శించారు. మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏ ర్పాటు చేయాలని, మున్నూరు కాపు బంధు ప్రకటించాలని, బిసి డి నుంచి బిసి ఏ జాబితాలోకి మార్చాలని లేదా ఇడబ్లూఎస్ రిజర్వేషన్ మాదిరిగానే ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ధర్నా చేపట్టింది.

ధర్నాలో సంఘం అధ్యక్షులు ఉగ్గె శ్రీనివాస్ ప టేల్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా ప నిచేసి ప్రాణత్యాగాలకు పాల్పడినా పాలకులు మున్నూరు కాపులను విస్మరించారని ద్వజమెత్తారు. అన్ని కులాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మున్నూరు కాపుల కోసం ఏ ఒక్క పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. రూ. 5వేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏ ర్పాటు చేయడం ద్వారా వివిధ యూనిట్ల ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతోందన్నారు. రైతులకు కాకుండా, పండించిన పంటకు బీ మా చేయాలన్నారు.

నామినేటెడ్ పదవులలో 30 శాతం కేటాయించాల ని, కాచిగూడలోని రూ.200 కోట్ల ఆస్తిని మున్నూరు కాపులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీకి తగిన బుద్ధ్ది చెబుతామని హెచ్చరించారు. కార్పొరేటర్లు రాజ్యలక్ష్మీ, దీపికి, లక్ష్మీనారాయణ, మామిండ్ల శ్రీనివాస్, కంటె సాయన్న పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News