ఎన్‌సిపి అజిత్‌పవార్‌దేనని తేల్చిన ఇసి
కొత్త పార్టీ ప్రకటనకు శరద్‌పవార్‌కు వెసులుబాటు
న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లో అజిత్ పవార్ సారథ్యంలోని వర్గమే ‘అసలైన’ ఎన్‌సిపి అని ఎన్నికల కమిషన్ (ఇసి) మంగళవారం ప్రకటించింది. పార్టీ వ్యవస్థాపకుడు, తన సన్నిహిత బం ధువు శరద్ పవార్‌తో మొదలైన వర్గ వివాదానికి దీ నితో తెర పడినట్లయింది. శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసిన జఅఇత్ పవార్ మహారాష్ట్రలో అధికార బి జెపి-, శివసేన ప్రభుత్వంలో చేరిన తరువాత 2023 జూలైలో ఎన్‌సిపి చీలిపోయింది. రెండు వర్గాలు పార్టీ పేరు, చిహ్నం తమకే చెందుతాయని ఎన్నికల కమిషన్ ముందు వాదించాయి. కానీ అజిత పవార్ వర్గమే ‘అసలైన’ ఎన్‌సిపి అని ఇసి తీర్పు వెలువరించింది.
అయితే, రాజ్యసభ ఎన్నికల దృష్టా కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు గాను శరద్ పవార్‌కు ఇసి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. బుధవారం సాయంత్రం 4 లోగా మూడు పేర్లు సూచించాలని శరద్ పవార్‌కు ఇసి గడువు ఇచ్చింది. పార్టీ నియమావళి లక్షాలు, ధ్యేయాలు, పార్టీ రాజ్యాంగం, సంస్థాగత, శాసనసభ సంబంధిత ఆధిక్యం పరీక్షలు వంటివి అనుసరించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వివరించింది. ఇసి తాజా నిర్ణయం నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ముంబయిలోని తన అధికార నివాసంలో ఎన్‌సిపి మంత్రులు, కొంత మంది ఎంఎల్‌ఎల సమావేశంలో ప్రసంగించాలని యోచిస్తున్నారు.