నల్లగొండ:అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బిఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ శాసన సభ్యులు, నల్లగొండ జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం పొల్లెపల్లిరాంనగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 80మంది ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. బిఆర్‌ఎస్ పా ర్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కెసిఆర్ అని అన్నారు. దేశ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కులేని పార్టీగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలి చావులు ఉండేవి. నేడు కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజల మూడు పూటలు కడుపు నింపుతున్న ఘ నత ముఖ్యమంత్రి కెసిఆర్‌కి దక్కిందన్నారు.
నేటికీ బిజెపి పాలిత ప్రాంతాలలో ప్రజల ఆకలి చావులు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాలన్వే పకడ్బందీగా అమలవుతున్నాయంటూ కితాబిచ్చారు. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సౄష్టించిన కేసీఆర్ పాత్ర కీలకం కానుందని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతీసంక్షే మ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్త ప్రధాన పాత్ర పో షించాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా అమలుకావడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, రైతు బంధు అ ధ్యక్షులు ఉజ్జిని విద్యాసాగర్ రావు, జిల్లా నాయకులు ముద్దం జోగయ్య గౌడ్, ఉప సర్పంచ్ ఈరటి శంకర్,గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల రా ములు, వార్డు సభ్యులు పిట్టల సాయిలు, ఈరటి చిన్న శేఖర్, కొప్పుల రాములు గౌడ్, నేనావత్ సుమన్, స్టాల్ రాములు, కొప్పుల యాదయ్య, ము త్యాలు, ముద్దం తిరపతయ్య గౌడ్,పార్టీలో చేరిన వారు గండికోట జం గయ్య, ఏటూరు విష్ణు, ముద్దం యాదయ్య, కరింగ యా దమ్మ,రెవతమ్మ, బోదసు మహేష్,కార్లకంటి భాగ్య మ్మ,అండాలు,బిజిలి సాయిలు,కన మోని యాదగిరి తదితరులు పాల్గొన్నారు.