Thursday, January 23, 2025

మృతి చెందడానికి అనుమతి కోరుతూ తహశీల్థార్ కార్యాలయం ముందు బైఠాయింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ ఇల్లందు రూరల్: తన భూమిని స్థానిక ప్రజాప్రతినిధి ఆక్రమించుకున్నారని, ప్రభుత్వం ఇచ్చిన భూమిని తనకు తిరిగి అప్పగించాలని లేని పక్షంలో తాను మరణించడానికి అనుమతించాలని కోరుతూ మాజీ నక్సలైట్ కొడెం సమ్మయ్య అలియాస్ చంద్రన్న బుధవారం స్థానిక తహశీల్థార్ కార్యాలయం ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

2008వ సంవత్సరంలో తాను జనజీవనస్రవంతిలో కలిశానని, ఆనాడు పునరావాసం కింద తనకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని మున్సిపల్ ప్రజాప్రతినిధి ఆక్రమించుకుని తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనభూమిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని పేర్కొంటూ ఫ్లెక్సీ కట్టి తన నిరసన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News