Monday, January 20, 2025

ఇల్లెందు మండలంలో విషాదం

- Advertisement -
- Advertisement -

A six-year-old boy fell into a pit and died

ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ముకుందాపురంలో ఆదివారం విషాదం నెలకొంది. ఆరేళ్ల బాలుడు ఇంటి పక్కన తీసిన నీటిగుంతలో పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు బయటకు తీసే చూసేసరికి హర్షదర్థన్ మృత్యువాతపడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News