Sunday, December 22, 2024

జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద

- Advertisement -
- Advertisement -

గేట్లు ఎత్తి,  దిగువకు 30350క్యూసెక్కులు నీటి విడుదల
గోదావరిలో పెరగిన వరద
భద్రాచలం వద్ద 41.97 అగులకు చేరిన నీటిమట్టం

మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీ పరివాహకంగా కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు స్వల్పంగా వరదనీరు చేరుకుంటోంది. ఎగువన కర్ణాటక నుంచి కృష్ణాద్వారా వరదనీరు రాకపోయినప్పటికీ, కృష్ణాకు ఉపనదుల్లో ఒకటిగా ఉన్న భీమా నది ద్వారా వరదనీరు చేరుతోంది.గురువారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో 28500క్యూసెక్కులు ఉండగా, రిజర్వాయర్‌లో నీటి నిలువ 8.95టిఎంసీల గరిస్టాయికి చేరువలో ఉంది.దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి 30359క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిలువ 81.83 టిఎంసీలకు పడిపోయింది. దిగువన నాగార్జను సాగర్‌లో కూడా నీటినిలువ 157.04 టిఎంసీలకు చేరుకుంది.
శ్రీరాంసాగర్‌కు 59078 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
గోదావరి నదిపరివాహకంగా వున్న ప్రాజెక్టులకు ఎగువ నుంచి గణనీయంగా నీరు చేరుకుంటోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 59078క్యూసెక్కులు ఉండగా , ఔట్‌ఫ్లో 54960క్యూసెక్కులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టులో నీటినిల్వ 90.31టిఎంసీల గరిష్ట స్థాయిలో ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 1,82,539 క్యూసెక్కులు ఉండగా, ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు 1,89,967క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మంజీరా నది ద్వారా సింగూరు ప్రాజెక్టులో 5557క్యూసెక్కుల నీరు చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 28వేల క్యూసెక్కుల నీరు చేరుతుండగా,ప్రాజెక్టు నుంచి 16600క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 14,342క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫో 17435క్యూసెక్కులు ఉంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీబ్యారేజిలోకి 3,07,590క్యూసెక్కుల నీరు చేరుతోంది. అంతే నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం సమక్క సాగర్ బ్యారేజి వద్ద గోదావరి నదిలో 4,57,984క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 41.97 అడుగులకు చేరుకుంది. నదిలో 4,32,613 క్యూసెక్కల నీరు ప్రవహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News