Monday, December 23, 2024

భూమి విషయంలో తండ్రిని కడతేర్చిన తనయుడు

- Advertisement -
- Advertisement -

నంగునూరు: భూమి విషయమై జరిగిన గొడవలో తండ్రిపై కొడుకు దాడి చేయగా చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందిన సంఘటన ఘనపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థ్ధులు తెలిపిన వివరాల ప్రకారం నంగునూరు మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన ఎర్రవెల్లి రాజయ్య(65) బార్య కనకవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెద్ద కుమారుడు రవి వ్యవసాయం చేస్తూ గ్రామంలో నివసిస్తుండగా చిన్నకుమారుడు రాజమల్లు బతుకు దెరువు కోసం సిద్దిపేటకు వెళ్లాడు. బుధవారం రాత్రి తండ్రితో కలిసి మద్యం సేవించిన రవి వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చే విషయమై గొడవపడి కొట్టాడు. ఈ ఘటనలో రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ఉదయం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిన్న కుమారుడు రాజమల్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజుగౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News