Thursday, January 23, 2025

వర్షాకాలం ఇబ్బందులపై చర్చించేందుకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలి

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో : వర్షాకాలంలో నగరవాసులు ఇబ్బందులు పడకుండా వెంటనే ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు దర్పాల్లి రాజశేఖర్‌రెడ్డి, రజిత పరమేశ్వర్ రెడ్డి, విజయారెడ్డిలు కోరారు. ఈ మేరకు బుధవారం జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్‌లను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఉప్పల్ కార్పొరేటర్ ర త పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఎక్కడ నాలాలు పొంగుతాయో ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొందని, నాలాల అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధ్ది పనులు చేపట్టామంటూ మాటల తప్ప చేతలు లేకపోవడం, ప్రతిసారి వరద ముప్పు ఉండదు అని అధికారులు మం త్రులు చెబుతున్నారని అయితే క్షేత్రస్థాయి లో పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు.

వరద పరిస్థితులపై ప్రత్యేకంగా జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలన్నారు. ఖైరతాబాద్ కార్పొరేట ర్ విజయరెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి కోట్లాది రూపాయలు పన్నులు వసూలు చేస్తున్నారే తప్ప ప్రజల ప్రాణాల కు భద్రత ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజలకు న మ్మకం కలిగే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది, ఎస్‌ఎన్‌డిపి పను ల్లో చాలావర కు అసంపూర్తిగా ఉండడం శోచనీయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News