Monday, December 23, 2024

దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ రూరల్ : గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నప్పటికి కూడా దేవస్థానాల అభివృద్ధికి కృషి చేయలేదని, సిఎం కెసిఆర్ ధార్మిక సంస్థలు, దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడం జరిగింది. బుధవారం దేవాలయ పునః నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడిగిన వెంటనే శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు 15 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కొల్లాపూర్ ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నప్పటికి కూడా దేవస్థానాల అభివద్ధికి కృషి చేయలేదని, సిఎం కెసిఆర్ ధార్మిక సంస్థ లు, దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. దక్షిణ యాదాద్రిగా పేరు గాంచిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని, ప్రతి సంవత్సరం స్వా మి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుందని, అందుకు అనుగుణంగా భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అనంతరం సింగోటం గ్రామస్తులు, మాచినేని పల్లి సింగిల్ విండో చైర్మెన్ చింతకుంట శ్రీనివాసులు, బిఆర్‌ఎస్ పార్టీ గ్రామ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు, యువకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం మాచినేనిపల్లి సింగిల్ విండో చైర్మెన్ చింతకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో ఉన్న పాలకులు దేవస్థానం అభివృద్ధి కృషి చేయలేదని, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ ప్రాంత దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గ్రామ ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News