Monday, December 23, 2024

బాసర ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం

- Advertisement -
- Advertisement -

బాసర : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం దేవాలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో జరిగిన వేడుకల్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు అర్చకులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
బాసర మండలం టాక్లి గ్రామంలో బుధవారం నూతనంగా నిర్మిస్తున ఖండోబా ఆలయ నిర్మాణానికి మండల నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ప్రభుత్వం నుండి రూ 30 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో ఆలయాలు అభివృద్ధ్ది చెందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News