Wednesday, January 22, 2025

మూసీ అందాలకు ముందడుగు

- Advertisement -
- Advertisement -

సబర్మతి, యమున రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను అధ్యయనం చేసిన ఆమ్రపాలి

నమామి గంగ ప్రాజెక్ట్ డిజి అశోక్ కుమార్‌తో భేటి.. పలు విషయాలపై చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్‌లో ప్రవహించే మూసినదికి కొత్త అందాలు తీసుకొచ్చేందుకు ముందడుగు పడుతుంది. సిఎం రేవంత్ రెడ్డి ఇటీవల మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండి ఆమ్రపాలి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఈనెల 3వ తేదీన గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, 6వ తేదీన యమునా రివర్‌ను సందర్శించి అక్కడి ఉన్నతాధికారులతో సమావేశమై అధ్యయనం చేశారు.

ఆయా ప్రాజెక్టులకు అనుసంధానంగా ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టిపి)లను, వాటి సామర్థ్యాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నమామి గంగా ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్‌తో కలిసి పలు చర్చించారు.ఆ రెండు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల ఉన్నతాధికారులు తమ అనుభవాలను మూసీ రివర్‌ఫ్రంట్ కార్పొరేషన్ ఎండి అమ్రపాలికి వివరించారు. అహ్మదాబాద్ మున్సిపల్ ఉన్నతాధికారి తెన్నరసన్, సబర్మతి రివర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ జగదీష్ పటేల్, జనరల్ మేనేజర్ సుశాంత్ భాటియా, నమామి గంగా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశిష్ట, ఉన్నతాధికారులు ఎన్. కే.మదన్, పీయూష్ గుప్తా తదితరులతో మూసి రివర్ ఫ్రంట్ అధికారులు సమావేశం అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News