Wednesday, January 22, 2025

బాత్‌రూం గోడ కూలి విద్యార్థికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

మద్నూర్: మద్నూర్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో అంగన్‌వాడీ గోడ కూలి విద్యార్థికి గాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ధన్నూర్ గ్రామంలో అంగన్‌వాడీలో దినేష్ (4 సంవత్సరాలు) చదువుకుంటున్నాడని, విద్యార్థులు బాత్ రూంకు వెళ్లగా, రాత్రి కురిసిన వర్షానికి బాత్ రూం పిట్ట గోడ కూలి దినేష్‌పై పడటంతో ప్రమాదంలో చిక్కుకున్నాడని మిగతా విద్యార్థులు తృటిలో తప్పించుకున్నారని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థికి అక్కడే ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఉపాధ్యాయులు కాపాడి చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి రెండు కాళ్లు విరిగినట్లు నిర్ధారించారని, చికిత్స అందిస్తున్నామని తెలిపారన్నారు.

బాత్ రూం శిథిలావస్థకు చేరుకున్నా ప్రభుత్వం పట్టించు కోలేదని, ప్రమాదం జరిగినట్లు స్థానికులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలు స్కూలుకు గానీ, అంగన్‌వాడీకి గానీ పంపించాలంటే భయం భయంగా ఉందని, భవనం శిథిలావస్థకు చేరుకు ందన్నారు. విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ సూపర్ వైజర్ కవిత అక్కడికి వెళ్లి ప్రమాదం గురి ంచి విచారణ చేపట్టిపై అధికారులకు నివేదిక పంపి తదుపరి చర్య తీసుకుంటామని తెలిపారు. ఈ విషయమై పాఠశాల హెడ్మాష్టర్ ప్రకాష్‌కు వివరణ కోరగా, ప్రమాదం జరిగింది వాస్తవమేనని, ప్రభుత్వానికి బాత్ రూం శిథిలావస్థకు చేరుకున్నాయని గతంలో నివేదిక పంపామని, ఎలాంటి చర్య చేపట్టకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. దినేష్‌కు కాలు విరగడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామన్నారు. పేద తల్లిదండ్రులు కావడంతో వారికి ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ నాయకులు రోహిదాస్ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News