Thursday, January 23, 2025

విజయవంతమైన ఒలంపిక్ డే రన్

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : నాగర్‌కర్నూల్ జిల్లా ఒలంపిక్ డే రన్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పురపాలక సంఘం పరిధిలోని జయప్రకాష్ గురుకుల పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా పాఠశాల ఆవరణలో ప్రపంచ యోగా డే సందర్భంగా విద్యార్థులతో కలిసి ఎమ్మెల్సీ యోగా చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్య తో పాటు యోగా, క్రీడా వంటి అన్ని రంగాలలో రాణించాలని, యోగా, క్రీడ లు మానసిక వికాసానికి దోహదం చేస్తాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్ర భుత్వం పాఠశాలలో మంచి విద్యాబోధన, గురుకులంలో మంచి భోజనం వ సతులు అందిస్తున్నారన్నారు. అనంతరం ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో పాటు ఆయన డే రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒలంపిక్ డే రన్ కన్వీనర్ బాబు లాల్, మండల విద్యాధికారి బాసు నాయక్, కల్వకుర్తి, వెల్దండ మండలాల నాయకులు, విద్యార్థులు, పిఈటిలు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News