Monday, December 23, 2024

ఆశాజనక భవిష్యత్తుకు చిహ్నం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం

- Advertisement -
- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్

హైదరాబాద్ : ఆశాజనక భవిష్యత్తుకు చిహ్నం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనం అని రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అభివర్ణించారు. అదే విధంగా శాశ్వతమైన పాత పార్లమెంట్ భవనం మన గొప్ప తనానికి గర్వకారణంగా నిలుస్తుందని కీర్తించారు. ఓ పార్లమెంట్ సభ్యునిగా ఈ ప్రదేశం ఎప్పుడూ విస్మయాన్ని కలిగిస్తుందన్నారు. అయితే ఆధునికతతో చరిత్రను కలపడం లేదా ప్రజాస్వామ్య పునరుద్ధరణకు నిదర్శనమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ నైపుణ్యంలోనే కాదు, ప్రజాస్వామ్య పురోగతికి దర్పణం కానుంది. ఈ సందర్భంగా పాత, కొత్త పార్లమెంట్ భవనాలకు సంబంధించిన ఇమేజ్‌లను క్లబ్ చేస్తూ వాటి ఔన్నత్యాన్ని, ప్రాశస్తాన్ని చాటిచెప్పేలా ఎంపి సంతోష్ తన ట్విట్టర్‌లో పొందుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News