దమ్మపేట ఆశ్రమ పాఠశాలలో
దారుణం పోక్సో చట్టం
కింద కేసు
మన తెలంగాణ/దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని ఓ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం సంచలనంగా మారింది. ఆశ్రమ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు పిచ్చయ్య విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని, విద్యార్థిని తల్లి దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు పిచ్చయ్య, ఆ పాఠశాలలో చదువుతున్న పదమూడేళ్లు వయసుగల విద్యార్థినీపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని, కీచక ఉపాధ్యాయుడిపై పోలీసులు ఫోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.
లైంగిక దాడిని కప్పి పుచ్చడానికి సహచర ఉద్యోగుల యత్నం?
ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడు లైంగిక దాడి ఘటనను కప్పిపుచ్చడానికి ఉపాధ్యాయుడి సహచరులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బాధిత విద్యార్థిని సహచర మిత్రులతో ఉపాధ్యాయుడు తప్పు ఏమిలేదని, కావాలనే విద్యార్తిని ఇలా అభియోగం మోపుతుందని ఉపాధ్యాయుడి తప్పును కప్పిపూడ్చేలా సహచరులు ప్రయత్నిస్తునట్లు సమాచారం. జరిగిన ఉదాంతాన్ని కప్పిపుచ్చడానికి పాఠశాల బాలికలను నిందిత ఉపాధ్యాయుడు మంచివాడని చెప్పాలని, ఒత్తిడి తెచ్చినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా, బాధిత బాలికకు దూరపు బంధువు, అదే పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ బాలిక పట్ల తెలియని చర్య జరిగి ఉంటుందని చెప్పడం కొస మెరుపు. బాలికను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు తీసుకువెళ్లగా కొంతమంది వ్యక్తులు అక్కడ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి సెటిల్మెంట్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
లైంగిక దాడిపై విచారణ చేపట్టిన డిస్ట్రిక్ డైరెక్టర్
ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్రమ పాఠశాలల డిస్ట్రిక్ డైరెక్టర్ రమాదేవి శనివారం విచారణ చేపట్టారు. ఆశ్రమ పాఠశాలలో బాధిత విద్యార్థిని సహచర మిత్రులతో బాధిత విద్యార్థిని ఏమైనా సమాచారం తెలియజేసినదా.. తరగతి గదిలో విద్యార్థుల పట్ల కీచక ఉపాధ్యాయుడు ప్రవర్తన ఎలా ఉండేదనే కోణంలో విచారణ సాగించారు.