Monday, December 23, 2024

ప్రీతికి కన్నీటి వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ జనగామ : ర్యాగింగ్ భూతానికి బలై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి మృతి చెందిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) మృతదేహాన్ని సోమవారం హైదరాబాద్ నుంచి జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలంలోని స్వగ్రామమైన గిర్నితండాకు అంత్యక్రియలకు తీసుకొచ్చారు. దీంతో చుట్టూ పక్కల గ్రామాల నుంచి ప్రీతి భౌతికకాయాన్ని చూ సేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రీతి మృతదేహాన్ని చూసినవారంతా కన్నీరుమున్నీరయ్యారు.

అదేవిధంగా పలు సంఘా లు ప్రీతి ఆత్మహత్యకు కారకులను కఠిన శి క్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం మ ధ్యాహ్నం ప్రీతి మృతదేహాన్ని వాహనంపై ఇంటి సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద కు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. ప్రీతి ఆత్మకు శాంతి కలగాలని పలు పాఠశాలలు బంద్ ప్ర కటించారు. వివిధ పార్టీల నేతలు హాజరుకాగా ప్రీతి పేటికను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణమాదిగ మోశారు. భాజాపాకు చెందిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్, కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి, స్థానిక బిఆర్‌ఎస్ నేతలు, మాజీ జీసీసీ చైర్మన్‌గాంధీ నాయక్, మండల బిఆర్‌ఎస్ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు, సమీప గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.

మంత్రుల పరామర్శ
డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కలి సి పరామర్శించి ఓదార్చి వారికి ధై ర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ మాట్లాడుతూ ప్రీతి మృతి అత్యంత దురదృష్టకరం, బాధాకరమన్నారు. ప్రీతి ఘటన పట్ల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర ఆవేదన విచారం వ్యక్తం చేశారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటనపై దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షింస్తామని తెలిపారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ప్రీతి మృతి చెంది వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉంటే కొందరు రాజకీయం చేయాలని చూడడం శోచనీయమన్నారు.

ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలా నిరోధించాలో ఆలోచన చేయాలి తప్ప, రాజకీయం చేయ డం సరికాదని హితవుపలికారు. ప్రీతిపై విషప్రయోగం చేశారని తల్లిదండ్రులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారని దీనిపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేశారని తెలిపారు. ప్రీతి చా లా ధైర్యవంతురాలు, కష్టపడి చదివి డాక్టర్ అయి ప్రజలకు సేవలు అందించాలని అనుకుంది కానీ ఇలా జరగడం దురదృష్టకరన్నా రు. నా కుమారుడు కూడా ఒక డాక్టర్, ప్రీతి ఎంత కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చిందో అర్థం చేసుకోగలుగుతామన్నారు.ప్రీతి ఆత్మ కు శాంతి చేకూరాలని వారి కుటుంబ స భ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో మంత్రులతో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ము న్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News