Friday, December 20, 2024

సమ్‌థింగ్ టు థింక్ అబౌట్…

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ట్విట్టర్‌లో ఎల్లవేళలా యాక్టివ్‌గా ఉంటూ ప్రజా సమస్యలతో పాటు ప్రజలను ఆలోచింపజేసే విధంగా మంత్రి కెటిఆర్ ట్వీట్ చేస్తుంటారు. తాజాగా కెటిఆర్ చేసిన ఓ ట్వీట్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. శుక్రవారం కెటిఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేస్తూ సమ్‌థింగ్ టు థింక్ అబౌట్ అంటూ రాసుకొచ్చారు.

మరి ఆ ఫోటోలో ఉన్న సారాంశమేంటంటే మీరు చెత్త వీధుల్లో వేస్తే దానిని అంతిమంగా తీసేందుకు ఒక అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్ కావాలి, దయచేసి చెత్తను డస్ట్ బిన్స్‌లో వేయండని రాసి ఉంది. ఇదే క్రమంలో చెత్త ఏరుతున్న ఓ బాలిక ఫోటోను కూడా ఆ బోర్డులో ఏర్పాటు చేశారు. అంటే చెత్తను ఎక్కడంటే అక్కడ పడేయకుండా చెత్తడబ్బాల్లోనే వేయాలని ఆ ఫోటోలో ఉన్న పరమార్థం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన బోర్డును కెటిఆర్ తన ట్విట్టర్ ఖాతాలో జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News