Thursday, January 23, 2025

భవనంపై నుంచి పడి మూడేళ్ల పాప మృతి

- Advertisement -
- Advertisement -

శంకర్‌పల్లి: భవనం నుంచి పడి ఓ మూడేళ్ల పాప మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని దొంతన్‌పల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. శంకర్‌పల్లి మండలం దొంతన్‌పల్లి గ్రామంలో ఎనిమిది నెలల నుంచి గడుసు శ్రీనివాస్ ఇంట్లో మొదటి అంతస్తులో రుద్రగిరి సింగ్, రేష్మాకుమారిలు భార్యభర్తలు అద్దెకు ఉంటున్నారు. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గురువారం సాయంత్రం 6:30 గంటల సమయంలో రేష్మాకుమారి కుమారుడికి ఇంట్లో పాలు పడుతుండగా ఇద్దరు కుమార్తెలు బయట ఆడుకుంటున్నారు. ఇంతలో భవనం పై నుంచి ఏదో కింద పడినట్లు శబ్దం వినిపించింది.

రేష్మాకుమారి వెళ్లి చూడగా తన చిన్న కూతురు రిషిక కిందపడిపోయింది. వెంటనే తల్లి కిందకు వెళ్లి చూడగా ఆమె రిషికకు తలకు బలమైన గాయమై రక్తస్రావమైంది. హుటాహుటిన రిషికను శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పాపకు ప్రథమ చికిత్స చేసిన తర్వాత హైదరబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. రిషికను మెరుగైన చికిత్స నిమిత్తం నానక్‌రామ్‌గూడలోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి 8:45 గంటల సమయంలో రిషిక మృతి చెందింది. తల్లి రేష్మాకుమారి ఫిర్యాదు మేరకు శంకర్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News