Monday, January 20, 2025

హైదరాబాద్‌లో వైద్యం వికటించి మూడేళ్ల బాలిక మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చందానగర్‌లో దారుణం జరిగింది. వైద్యం వికటించి మూడేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జ్వరంతో బాధపడుతున్న అక్షిత (3) ను చందానగర్‌లోని శ్రీ పాద్ హాస్పిటల్‌కు కుటుంబసభ్యలు తీసుకొచ్చారు. బాలికకు రక్తం తక్కువగా ఉందని వైద్యులు రక్తం ఎక్కించారు. రక్తం ఎక్కించే క్రమంలో చిన్నారి మృతి చెందింది. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలిక మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్షిత మృతదేహం తో హాస్పిటల్ ముందు బైఠాయించి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. ఘటనాస్థలికి చందానగర్ పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News