Saturday, December 28, 2024

కష్టకాలంలో పార్టీకోసం పనిచేసిన వారికె టికెట్ ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -

కొల్లాపూర్ : కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. మాజి మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరకముందే టికెట్ల పంచాయితి కాస్త సభావేదికలపైకి వచ్చింది. అధిష్టానం సర్వేలతో టికెట్ ఇస్తామని చెప్పిందని పార్టీలో చేరితే మాజి మంత్రికి టికెట్ ఇస్తామని చెప్పలేదంటూ పిసిసి ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. ప్రజలు, కర్యకర్తల అభిష్టం మేరకు టికెట్ ఇవ్వాలి కాని సర్వేలు కాదంటూ మాజి మంత్రి నాగర్‌కర్నూ ల్ మాజి ఎమ్మేల్యే నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్లను గుర్తించాలని కోరారు. దీంతో కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల సభ కాస్త ఎన్నికలకు ముందే రాజకీయ వేడి రాజుకుంది.
కొల్లాపూర్ పట్టణంలోని మహాబూబ్ పంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి పిసిసి ఉపాధ్యక్షులు మల్లురవి,మాజి మంత్రి నాగర్‌కర్నూల్ మాజి ఎమ్మేల్యే నాగం జనార్ధన్‌రెడ్డి, పిసిసి సభ్యులు, కొల్లాపూర్ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్‌రావులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసి వాళ్లను వదిలి జూపల్లి, కూచుకుళ్లకు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని మాజి మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరినప్పుడు పార్టీ కోసం పనిచేయాలని సూచించాం, కర్ణాటకలో మాదిరిగా రాష్ట్రంలో సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని సూచించినట్లు పిసిసి ఉపాధ్యక్షులు మల్లురవి అన్నారు. దీంతో కార్యకర్తలు అడ్డుతగిలి చింతలపల్లికి అనుకూల నినాదాలతో హోరెత్తించారు. టికెట్ల కేటాయింపు సర్వేల ఆధారంగా కాకుండా ప్రజల, కార్యకర్తల అభిష్టం మేరకు కేటియింపు ఉండాలని, పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వారిని గుర్తించాలని నాగం జనార్ధన్‌రెడ్డి కోరారు. అంతకు ముందు రాష్ట్రంలో ఆంద్రప్రధేశ్ జల దోపిడీకి పాల్పడుతున్నా ఇక్కడి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్కడ ప్రాజెక్టులు పూర్తవుతున్నా ఇక్కడ ఎస్‌ఎల్‌బిసి మాత్రం పూర్తి కాదన్నారు.

అలాగే ప్రాజెక్టులకు తాను వ్యతిరేకం కాదని దోపిడీని వ్యతిరేకిస్తున్నాను అన్నారు. నాడు కేఎల్‌ఐ కాలువల వెడల్పు చేయాలని కోరినా పట్టించుకోలేదన్నారు. తాను ఫిట్‌గానే ఉన్నాను అని ఎన్నికల్లో పోటీలో ఉంటానని కామెంట్ చేశారు. అంతకుముందు భారీ ర్యాలీతో కొల్లాపూర్ పట్టణానికి కార్యకర్తలతో కలిసి చింతలపల్లి జగదీశ్వర్‌రావు వచ్చారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాముయాదవ్, జగదీశ్వరుడు, పరుశురాముడు, వివిధ మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News