Wednesday, November 27, 2024

బండరాయి మీద పడి గిరిజన రైతు మృతి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: బండరాయి మీద పడి గిరిజన రైతు మృతిచెందిన ఘటన బుధవారం వెంకంబావి తండా గ్రామ సమీపంలోని ఊడుగు గుట్టపై చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంబావి తండా గ్రామానికి చెందిన రమావత్ శ్రీను(40) మంగళవారం ఉదయం 10 గంటలకు సమీపంలోని ఊడుగు గుట్టకు గొడ్డలికామ కొట్టుకొస్తానని వెళ్లాడు.

గొడ్డలికామ కోసం చెట్టును నరికి ఆ పక్కనే ఉన్న బండరాయికి కాలుపెట్టి కొమ్మను లాగుతుండగా స్లిప్పయ్యి వెనకకు పడటంతో అదే బండరాయి కదిలివచ్చి మీద పడి అక్కడిక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లేపకపోవడం, సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం గుట్టకు చేరుకున్న పోలీసులు రాత్రి వరకు వెతికినా ఎక్కడా కనిపించలేదు.

తెల్లవారుజామున గ్రామస్తులు అందరు కలిసి గుట్టపై గాలించగా బండరాయి మీద పడి మరణించినట్లుగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంటనే ఇక్కడి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు జరుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News