Monday, December 23, 2024

ట్విట్టర్ యూజర్‌కు సమంత ధీటైన జవాబు!

- Advertisement -
- Advertisement -

 

Samantha
హైదరాబాద్: నటి సమంత రుత్ ప్రభు ఇటీవల తన పెంపుడు కుక్క(సాషా)తో ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. అది ఆమె తన వర్కవుట్ సెషన్‌లో తీసిన ఫోటో. అయితే ఆమె అభిమానులు దానిని మెచ్చుకుంటే… ఒక ట్విట్టర్ యూజర్ మాత్రం ‘ఒంటరిగా పిల్లులు, కుక్కలతోనే చస్తావు’ అని వ్యాఖ్యానించాడు.

దానికి సమంత ఏమాత్రం తొణకకుండా అలాగైతే తాను ‘లక్కీ’ యే అవుతానని పేర్కొంది. కాగా, ఆ ట్విట్టర్ యూజర్ మాత్రం ఆమె అభిమానుల దాటికి తట్టుకోలేక తన వ్యాఖ్యని ట్విట్టర్ నుంచి తొలగించాడు. కానీ అతడి వ్యాఖ్యకు సంబంధించిన స్క్రీన్‌షాట్ మాత్రం ఆమె అభిమానులలో ఇంకా చక్కర్లు కొడుతోంది.

Image

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News