Friday, December 20, 2024

రేపు తీరం దాటనున్న తుపాన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు తేలికపాటి వర్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుపాను గంటకు 5కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదిలింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 290 కి.మీ , చెన్నైకి ఆగ్నేయంగా 290కి.మీ నెల్లూరుకు ఆగ్నేయంగా 420 కి.మీ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్యదిశగా పయనిస్తూ మరింత బలపడి డిసెంబర్ 4 ఉదయానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ,ఉత్తర తమిళనాడు తీరాలకు అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది ఉత్తరం వైపునకు కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతూ డిసెంబర్ 5వతేది మధ్యాహ్నం సమయంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా నెల్లూరు మచిలీపట్నం మధ్య తీవ్ర తుపాన్‌గా తీరం దాటే అవకాశం ఉంది.

కింది స్థాయిలో గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నాయి. సోమవారం తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట , నల్గొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం వుంది. కొన్ని జిల్లాలలో ఉరుములు , మెరుపులతో కూడిన తెలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో వీచే అవకాశం వుంది. మంగళవారం రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లె, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం , సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు , మెరుపులతో కూడిన భారీ నుండి అతిభారీ వర్షాలు , నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం వుంది. కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తెలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కి.మీ. వేగంతో వీచే అవకాశం వుంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలతోపాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News