Friday, September 20, 2024

మాలిలో యుఎన్ విమానంపై ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి

- Advertisement -
- Advertisement -

మాలి దేశ రాజధాని బమాకో విమానాశ్రయంలో ఐక్యరాజ్యసమితి (యుఎన్)కి చెందిన చార్టెర్డ్ విమానంపై ఇస్లామిక్ ఉగ్రవాదు ల దాడి జరిగింది. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద బాధితులకు మానవతా సాయం అందించడానికి ఈ విమానాన్ని వినియోగిస్తుంటారు. మంగళవారం బమాకో విమానాశ్రయంలో ఈ దాడి జరిగిందని , అయితే విమానం లోని సిబ్బందికి కానీ, విమానపైలట్లకు కానీ ఎలాంటి ప్రాణహాని జరగలేదని నేషనల్ ఎయిర్‌వేస్ కార్పొరేషన్ బుధవారం వెల్లడించింది. బమాకో విమానాశ్రయంలో మిలిటరీ శిక్షణ శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు.

కొంతమంది సైనికులను చంపివేశారు. అయితే తరువాత మాలి దళాలు ఆ ఉగ్రవాదులను అదుపు లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 15 మంది అనుమానితులను అరెస్టు చేసినట్టు సెక్యూరిటీ అధికారి వెల్లడించారు. ఈ దాడి తామే చేశామని అల్ ఖైదాతో సంబంధం ఉన్న జెఎన్‌ఐఎం గ్రూపు వెల్లడించింది. మాలి ప్రజలకు మానవతా సాయం అందిస్తుండగా ఈ దాడి జరగడం శోచనీయమని నేషనల్ ఎయిర్‌వేస్ కార్పొరేషన్ పేర్కొంది. అయితే బమాకోలో వ్యాపారాలు, ప్రజాజీవితం యథాతధంగా కొనసాగినట్టు వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News