- Advertisement -
జనగామ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జనగామలో ఘనంగా ఆధ్మాత్మిక దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా జనగామ పట్టణంలోని బతుకమ్మకుంటలో దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా జనగామ పట్టణంలోని రైల్వేస్టేషన్ ఏరియాలోని జామియా మసీద్‌లో, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఉనృపుర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మునిసిపల్ చైర్పర్సన్ పోకల జమున, కమిషనర్ జె.రజిత, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ మతాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -