పాపికొండలు ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం
అరుదైన నల్ల మద్ది చెట్టు
ఈ చెట్టు నుంచి 20 లీటర్ల వరకు నీరు వస్తుందని వెల్లడి
కింటుకూరు: గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పాపికొండలు వద్ద అరుదైన వృక్షాన్ని గుర్తించారు. ఇక్కడి కింటుకూరు అటవీప్రాంతంలో ఓ జలధార వృక్షం అటవీశాఖ సిబ్బంది కంటపడింది. దీన్ని నల్ల మద్ది చెట్టు అంటారని, దీని నుంచి దాదాపు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని వారు వెల్లడించారు. కింటుకూరు అటవీప్రాంతంలోని బేస్ క్యాంపును పరిశీలించేందుకు అటవీశాఖ అధికారులు వెళ్లగా, అక్కడ ఈ జలధార వృక్షం ఉండడాన్ని వారు గమనించారు. ఓ ఫారెస్ట్ గార్డ్ కత్తితో చెట్టుకు కొద్దిమేర రంధ్రం చేయగా, కుళాయి తిప్పినట్టు నీరు బయటికి వచ్చింది. చెట్టు నుంచి నీరు బయటికి రావడం చూసి అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.
అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం
పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు.
నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2024