Sunday, December 22, 2024

ఆస్తి కోసం భర్తను కట్టేసిన భార్య

- Advertisement -
- Advertisement -

ఆస్తి కోసం భర్తను గొలుసులతో కట్టేసింది ఓ భార్య. ఈ దారుణ సంఘటన మేడ్చల్ – ఘట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉండే భార్యాభర్తలు పత్తి కృష్ణ(50), భారతి (45) మధ్య రెండు ఫ్లాట్ల విషయంలో వివాదం జరిగింది. భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కృష్ణ ఆచూకీ తెలుసుకున్న భార్య మూడు రోజుల క్రితం భర్తను పట్టుకొచ్చి గొలుసులతో కట్టేసి ఇంట్లో బంధించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కృష్ణను విముక్తి చేయగా, 3 రోజుల నుండి తనను కొడుతూ బాధలు పెట్టారని పోలీసుల ముందు ఏడ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News