- Advertisement -
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని సల్కర్‌పేట్ గ్రామానికి చెందిన జ్యోతి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో కలెక్టరేట్ కార్యాలయం ముందుపోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సల్కరిపేట గ్రామానికి చెందిన చంద్రారెడ్డి భార్య జ్యోతి బావ వెంకట్ రెడ్డి కుటుంబానికి చెందిన భూమిని తన పేరు పైన చేసుకున్నాడని, భూ వివాదంలో గతంలో ఒకసారి పెట్రోల్ పోసుకుని కలెక్టర్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేయగా సంబంధిత అధికారులు నచ్చచెప్పడంతో వెళ్లిపోయారు. రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటికి భూ వివాదం పరిష్కారం కాలేకపోవడంతో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మరోసారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సెక్యూరిటి సిబ్బంది గమనించి వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
- Advertisement -