Friday, March 14, 2025

ఉత్తరభారతంలో ఒక మహిళ 10 మందిని పెళ్లాడే సంప్రదాయం

- Advertisement -
- Advertisement -

ఉత్తర భారతంలో ఒక మహిళ పది మందిని వివాహం చేసుకునే సంప్రదాయం ఉందని తమిళనాడు మంత్రి దురై మురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క హిందీని బలవంతంగా రుద్దడంపై డిఎంకె ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం సాగుతున్న వేళ.. మురుగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళులను ఎవరైనా కించపరిస్తే.. వారి నాలుకలు తెగ కోస్తామని మురుగన్ అన్నారు. నోటి దురుసుకు పేరు పొందిన దురై మురుగన్ ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. దక్షిణాదిన ఆచారాల మాదిరిగా కాకుండా ఉత్తర భారతంలో

బహు బార్యత్వం, బహు భతృత్వం ఆమోదిస్తారని పేర్కొన్నారు.మహా భారతంలో ద్రౌపతి ఐదుగురిని పెండ్లాడిన విషయాన్నీ ప్రస్తావించారు.మంత్రి దురై మురుగన్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. మంత్రి వ్యాఖ్యలకు ఎంకె స్టాలిన్ ఉత్తరాది ప్రజలకు, ముఖ్యంగా మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని బిజెపికి చెందిన అమర్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ విద్వేషపూరితమైన వ్యాఖ్యల పట్ల స్టాలిన్ మౌనం ఆ పార్టీ ఉత్తర భారతం పట్ల ఆయన వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News