Monday, December 23, 2024

గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కొండాపూర్: గుర్తు తెలియని వాహనం గుర్తు తెలియని మహిళను ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన కొండాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిష్టయ్య గూడెం శివారులోని ముంబాయి నేషనల్ హైవేపై జరిగింది. గురువారం కొండాపూర్ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం బుధవారం అర్దరాత్రి దాటిన తర్వాత మల్కాపూర్ శివారులోని మదిర కిష్టయ్య గూడెం శివారులోని ముంబాయి హైదరాబాద్ నేషనల్ హైవేపై 45 నుంచి 50 సంవత్సరాల మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడ మృతి చెందిందన్నారు. ఛామన ఛాయ రంగు కోలా బుఖం, ఎత్తు 5ఫీట్ ఉందని బూడిద రంగు నిలువు గీతల గల తెల్లటి టీషర్ట్ నీలి రంగు చీర ధరించి ఉందని పోలీసులు తెలిపారు. ఎవరైన ఆమెను గుర్తించిన వెంటనే కొండాపూర్ సిఐ 8712656748, ఎస్‌ఐ 8712656722 నెంబర్‌లో లేదా కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News