Monday, January 20, 2025

అతివేగం.. ఆటో నుంచి కింద పడి మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

మణుగూరు: అతివేగంగా, నిర్లక్ష్యంగా ఆటో నడపడం వల్లన ముందు కూర్చున్న మహిళ అదుపు తప్పి కింద పడి తలకి తీవ్ర గాయం కావడంతో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈవిషయంపై ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పినపాక మండలం పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన పుస్తం భవాని(29) అనే మహిళ బోళ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుందని, ఆదివారం విజయనగరం అవతల వ్యాపారం అనంతరం బోళ్లతో సహా ఆటో ఎక్కి ప్రయాణిస్తుండగా ఆటో డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్ల ముందు కూర్చున్న మహిళ అదుపు తప్పి కింద పడి తలకి తీవ్ర గాయం అయింది. వెంటనే డ్రైవర్ ఆమెను శశిధర్ హాస్పిటల్‌కి అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. మృతురాలికి పిల్లలు ఉన్నారు. తండ్రి మారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News